MHBD: విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని DPRO రాజేంద్రప్రసాద్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే కీలకం: DPRO


