హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటీకరణతో 80 వేల మందికి ముప్పు?

HYD: కోయగూడెం-3, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని AITUC నాయకులు డిమాండ్ చేశారు. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సుమారు 80 వేల మంది కార్మికుల ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ రెండు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.