మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపిక అయ్యాడు. రేచిని ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్ గోవాలో ఈనెల 17 నుంచి 24 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. పాఠశాల HM ప్రదీప్, ఉపాధ్యాయులు అతనికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు సంతోష్ కుమార్ ఎంపిక


