హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోడుప్పల్‌లో 404వ జ్ఞానమాల కార్యక్రమం

MDCL: బోడుప్పల్‌ అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య ఆధ్వర్యంలో 404వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మైసయ్య పేర్కొన్నారు.