హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక వనభోజనాల పోస్టర్ ఆవిష్కరణ

హనుమకొండ నగరం రెడ్డి కాలనీలోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం నాలుగో డివిజన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 29న ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వీటిని నిర్వహిస్తామని అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు వైద్యం రాజగోపాల్, బొత్స ఆనందం, నల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.