హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NRML: సారంగాపూర్ మండలం కంకెట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనం, విలేజ్ ఆర్గనైజేషన్ భవనం,షెడ్లతో పాటు ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్‌ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాహేబ్ రావు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.