హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల మంజూరు కార్యక్రమంలో మంత్రి

WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో మంత్రి సీతక్క నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ఉత్తర్వులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని సొంత వ్యాపారాలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తోందన్నారు.