మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఎల్లారం పోచమ్మ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు ప్రత్యేక మొక్కుల కోసం డప్పుల చప్పులతో, శివసత్తుల పూనకాలతో, బోనాలను ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఎల్లారం పోచమ్మ దేవాలయానికి పోటెత్తిన భక్తులు


