RR: ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం పెదవేరు గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఛైర్మన్


