ASF: తిర్యాణి మండలం గుండాలలో సాగునీరు అందక కోత దశలో ఉన్న వరి పంట ఎండిపోయింది. దీంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసీ నాయకుడు పెందోర్ దౌలత్ రావు కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మైసమ్మ చెరువు తూము నుంచి సాగునీరు అందక పంట ఎండిపోయిందని తెలిపారు. అధికారులు సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: గుండాలలో సాగునీరు అందక ఎండిపోయిన పంటలు


