హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెబ్బేరులో CMRF చెక్కుల పంపిణీ

WNP: పెబ్బేరులో లబ్ధిదారులకు ఈనెల 16న సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయనున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు వల్లపురెడ్డి అనసూయమ్మ ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.