హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌లో రూ.4 కోట్లతో జలసౌధం నిర్మాణం

NRPT: మక్తల్ శివారులో రూ.4 కోట్లతో చేపట్టిన జి+3 అంతస్తుల ఇంజనీరింగ్ సర్కిల్ కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సంగంబండ లెఫ్ట్ కెనాల్ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనంలో ఐదు సబ్ డివిజన్లతో పాటు సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని డీఈ సురేష్ తెలిపారు.