హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎండిన వరి పంట.. రైతుకు తీరని నష్టం

SRPT: మోతె మండలం గోల్ తండాకు చెందిన రైతు సైదులు రెండెకరాల్లో బోరు నీటితో వరి సాగు చేశారు. పంట పొట్ట దశకు చేరుకున్న సమయంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు నుంచి నీరు రాక పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి నేలపాలైంది. పచ్చని పంటతో కళకళలాడాల్సిన పొలంలో ప్రస్తుతం పశువులను మేపుకుంటున్న రైతు పరిస్థితి పలువురిని కలచివేస్తోంది.