హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కరాటే పోటీలు ప్రారంభం

MBNR: జడ్చర్ల పట్టణంలోని ఆర్కే గార్డెన్స్‌లో దివంగత చర్లకొల శ్వేత జ్ఞాపకార్థం 28వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.