NGKL: కొల్లాపూర్ నియోజకవర్గానికి మంజూరైన కొత్త చేయూత పింఛన్లను ఈ నెల 16వ తేదీ సోమవారం పంపిణీ చేయనున్నారు. పట్టణంలోని రాజాగారి బంగ్లా వద్ద నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వీటిని అందజేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ తప్పక హాజరై పింఛన్లు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
రేపు చేయూత పింఛన్ల పంపిణీ


