SRPT: మోతె మండలంలోని నామవరంలో ఈ రోజు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను కీసర సంతోష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సామాజిక భద్రతే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తోందన్నారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని తెలిపారు.
తెలంగాణ
నామవరంలో చేయూత పింఛన్ల పంపిణీ


