NLG: నిడమనూరు మండలంలో వరి నారుమళ్ల సాగు జోరుగా సాగుతోంది. ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ రైతులు వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తూ నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారుల సూచనలు పట్టించుకోకుండా వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు


