హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరీంనగర్ సమస్యలపై గళమెత్తుతాం: CJP

KNR: కరీంనగర్‌లోని డంపింగ్ యార్డ్, బడుల దుస్థితి, వైద్య రంగంలోని అవకతవకలపై యువత పోరాడాలని కాక్రోచ్ జనతా పార్టీ సౌత్ జోన్ ఇన్‌ఛార్జ్ విజయ్ మల్లంగి పిలుపునిచ్చారు. నగరంలో యువతీయువకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. నెల రోజుల పనితీరును బట్టి జిల్లా కమిటీని ప్రకటిస్తామని తెలిపారు.