హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ కడుపులో 8 కిలోల భారీ కణితి

RR: శంకర్‌పల్లి మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భసంచి పక్క భాగంలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 8 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు.