హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్‌రావు ఇంటికి బయలుదేరిన KCR

MDCL: మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు సంవత్సరీక కార్యక్రమానికి BRS అధినేత, మాజీ సీఎం KCR హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన కోకాపేటలోని హరీశ్‌రావు నివాసానికి బయలుదేరారు. సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఇప్పటికే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హరీశ్‌రావు ఇంటికి చేరుకున్నారు.