హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి పేరుతో పరిచయం.. డబ్బులు వసూలు

HYD: పెళ్లి పేరుతో పరిచయం పెంచుకుని రూ.30 లక్షలకుపైగా మోసం చేశారంటూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన ఓ మహిళ తన నుంచి డబ్బులు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరించిందని, తన ఒరిజినల్ సర్టిఫికెట్లు, బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లిందని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.