PDPL: సరియైన ఆహారపు అలవాటు పాటిస్తే మధుమేహంను అదుపులో ఉంచవచ్చని ధర్మారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నర్సింగం సూచించారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ధర్మారం ముదిరాజ్ కాలనీలో మధుమేహ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వ్యాధిపట్ల అవగాహన కల్పించారు. డాక్టర్ కుమార్, ప్రధాన కార్యదర్శి కట్ట రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సరియైన ఆహారపు అలవాట్లతో మధుమేహం అదుపు'


