హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయిజలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

GDWL: అయిజ ప్రభుత్వ ఆసుపత్రిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు షేక్షావలి ఆచారి, సంకాపురం రాముడు శిబిరాన్ని ప్రారంభించారు. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్సతో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు.