GDWL: మల్దకల్ మండలం దాసరిపల్లి సర్పంచ్ బోయ వెంకటేశ్‌పై గత రాత్రి దాడి జరిగింది. బిజ్వారం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా దొరబాయి సమీపంలో మహేందర్‌తో పాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. వెంకటేశ్ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు తూమ్ కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
తెలంగాణ
దాసరిపల్లి సర్పంచ్‌పై దాడి


