హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలలో పుస్తక ప్రదర్శన

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనతో పాటు విద్యార్థులకు జ్ఞాపకశక్తి పరీక్ష పోటీలు నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ సంగనబట్ల దినేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.