హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి!

NZB: జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోపెడ్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.