హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో పారిశుద్ధ్య వాహనాలు ప్రారంభం

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచేందుకు నూతనంగా సమకూర్చిన 6 వాహనాలను మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డుల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.