ములుగులో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని బలరాం కొనియాడారు. అణచివేతను ఎదిరించి గిరిజనుల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బిర్సా ముండాకు బీజేపీ నివాళి


