హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆమనగల్ మార్కెట్‌లో పారిశుధ్యం కరువు

RR: రైతులు, వ్యాపారులతో నిత్యం రద్దీగా ఉండే ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మార్కెట్ ప్రాంగణంలో కోడి రెక్కలు, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిసరాల్లో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.