హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ‘ఆటుపోట్లు’ పుస్తకావిష్కరణ

RR: అమనగల్ పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో రచయిత దొబ్బల విష్ణు రచించిన ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, తగ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ CEO రాఘవేందర్‌రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక రచన అంటే కేవలం అక్షరాలను పొందుపరచడం మాత్రమే కాదని, తమ ఆలోచనలు, అనుభవాలను సమాజంతో పంచుకునే గొప్ప ప్రయత్నమని పేర్కొన్నారు.