హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెరువు నీళ్ల కోసం వేలంపాట

WNP: చిన్నంబావి మండలంలో సాగునీరు, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు చెరువులు, కుంటలు, బావుల్లోని నీటికి వేలంపాట నిర్వహించారు. నల్లచెరువు రూ.2 లక్షలు, ఊరుకుంట రూ.1 లక్ష, ఊరబావి రూ.81 వేలకు వేలంలో దక్కించుకున్నారు. నీటి వినియోగానికి రోజుకు రూ.7 వేలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.