హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాపాదయాత్రకు పిలుపు

MLG: మేడారంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు టీయూఎఫ్ నాయకులు గద్దెల వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జంపన్నవాగు నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెల వరకు యాత్ర చేపట్టనున్నారు. ఉమ్మడి వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది.