హైదరాబాద్: 28°C
తెలంగాణ

తవ్వి వదిలేశారు.. ప్రమాదాలకు నిలయాలుగా రోడ్లు!

NRML: ఖానాపూర్ పట్టణంలోని పలు కాలనీల్లో మిషన్ భగీరథ,అమృత్ 2.0 పైప్‌లైన్ పనుల కోసం తవ్విన రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యానగర్, శాంతినగర్, పద్మావతినగర్, శ్రీరామ్‌నగర్, సుభాష్‌నగర్, ఇంద్రానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమై గుంతలు, పైకి తేలిన రాళ్లతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.