హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారాంతపు ప్రమాదాల నివారణకు తనిఖీలు: ఎస్సై

VKB: వారాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్సై రమేశ్ తెలిపారు. శని, ఆదివారాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.