హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఇంటికీ మోదీ అభివృద్ధి పనులు: రాంచందర్ రావు

HYD: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అన్ని సెల్స్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజలకు వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు.