హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బైకర్లే అధికం

HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 282 మంది పట్టుబడ్డారు. వీరిలో 233 మంది ద్విచక్ర వాహనదారులు, 36 మంది కార్ల డ్రైవర్లు, 11 మంది ఆటో డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.