NLG: మునుగోడు ఆర్టీసీ బస్టాండ్‌లో పదేళ్ల క్రితం రూ.3 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ నిరుపయోగంగా మారింది. గతంలో కృష్ణా జలాలతో ప్రయాణికుల దాహార్తిని తీర్చగా, రెండేళ్లుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు దుకాణాల్లో నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ట్యాంక్‌కు నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా మంచినీటి ట్యాంక్


