హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదింట సాకారమైన సొంతింటి కల'

RR: సీఎం రేవంత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా నిర్దవెల్లి గ్రామంలో లబ్ధిదారురాలు కొత్తపేట అంతమ్మ నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ చెదురువెల్లి భాస్కర్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.