WNP: నల్లగొండలో నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభల సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు వనపర్తి నుంచి కార్మికులు తరలివెళ్లారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పుట్ట ఆంజనేయులు జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. రైతు, కార్మిక ఐక్యతను చాటేందుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రైతు మహాసభలకు కార్మికుల తరలింపు


