హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే

GDWL: ప్రజాపాలనలో పేదల సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేటిదొడ్డి మండలంలోని సుల్తానాపురంలో లబ్ధిదారుడు లింగప్ప నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో తొలి విడతగా మంజూరైన 3,500 ఇళ్లలో 2 వేలకు పైగా నిర్మాణంలో ఉన్నాయని, మిగతా అర్హులకు రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.