హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీల కొరత.. నిలిచిన ధాన్యం కొనుగోలు

MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి లారీలు రాక సుమారు 15 రోజులు గడుస్తుంది. దీంతో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు సైతం నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభంలోనే ఈ విధంగా లారీల కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి లారీలు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.