హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆనకట్ట పనులను పరిశీలించిన మంత్రి

BDK: దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ పరిశీలించారు. ఇసుక బస్తాలతో చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు పటిష్టం చేయాలని,పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.