హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొమ్మిదేళ్లుగా రోడ్డు దుస్థితి.. గ్రామస్థుల నిరసన

JN: పల్లగుట్ట క్రాస్రోడ్డు నుంచి ఫతేపూర్ వరకు సర్వీస్ రోడ్డు దెబ్బతినడంతో గ్రామస్థులు ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. రెండేళ్లుగా రోడ్డు మంజూరైందని చెబుతున్నా పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఫణిందర్, జంపయ్య, రాజు నాయక్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది ఆందోళనలో పాల్గొన్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ చేరుకుని నిరసనకారులను పంపించారు.