హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన పోరాట యోధుడికి నివాళులు

ASR:డుంబ్రిగూడ మండలంలోని కోసంగి పనసపుట్టులో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను స్థానిక గిరిజనులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.