హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగవాన్ బిర్సా ముండాకు నాయకుల ఘన నివాళి

ADB: బోథ్ మండల కేంద్రంలో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 25 ఏళ్ల వయసులోనే జల్ జంగిల్ జమీన్ కోసం ఉద్యమించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటాన్ని, సామాజిక సేవలను స్మరించుకున్నారు.