హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారిపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

KRNL: హాలహర్వి మండల కేంద్రంలోని శివారులో ఛత్రగుడి-మోకా రహదారిపై పశుగ్రాసం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. కర్ణాటక నుంచి మొక్కజొన్న సొప్ప తరలిస్తుండగా రహదారిపై పడిన గుంతలను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.