హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవలస గ్రంథాలయంలో రెండోరోజు పుస్తక ప్రదర్శన

VZM: 59వ,గ్రంథాలయ వారోత్సవాలలో బాగంగా రెండోరోజు కొత్తవలస శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో దేశానికి సేవనందించిన ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థులు, యువత జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని గ్రంథాలయ అధికారిణి రామలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు.