హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటు సారా తయారీపై దాడులు..!

WGL: చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామ పరిధిలోని మేఘ్యా తండాలో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 లీటర్ల నాటు సారా, 23 కిలోల బెల్లం, 4 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11,100గా పోలీసులు తెలిపారు. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 4,500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.