హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిని దిగ్భందించిన గ్రామస్తులు

AKP: వరాహ నదిలో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెనుగొల్లు వద్ద గ్రామస్తులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనకాపల్లి-తుని రహదారిపై బైఠాయించడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. హోంమంత్రి అనిత వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు పట్టుబట్టారు.