హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు గ్రామాల నాయకులతో ఎమ్మెల్యే భేటీ

PLD: పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదివారం ఉదయం అచ్చంపేట మండలంలోని పలు గ్రామాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల పురోగతిపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.